అతిగా నిద్రపోతున్నారా.? అయితే ఇది మీ కోసం..!!

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 03:13 PM

అతిగా నిద్రపోతున్నారా.? అయితే ఇది మీ కోసం..!!

మనలో చాలా మందికి నిద్రపై మక్కువ ఎక్కువ. నిద్రపోవటం కంటే సుఖం ఇంకెందులో ఉండదు అనుకుంటారు. కానీ.....అతి నిద్ర ఏమాత్రం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా ఎనిమిది గంటలు మించి నిద్రపోతూ ఉంటే వారు ఏక్షణమైనా సమస్యల వలయంలో చిక్కుకోవచ్చని సెలవిస్తున్నారు.

వీరికి గుండెపోటు వచ్చేందుకు 46 శాతం అధికంగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏడు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోయి తప్పనిసరిగా వ్యాయామం చేసేవారు మాత్రం జీవితాంతం ఎలాంటి ఆరోగ్య పరమైన సమస్యలను ఎదుర్కోకుండా హాయిగా బతికేయొచ్చని కూడా వారు సెలవిస్తున్నారు.

ఇప్పటి వరకు అత్యంత ప్రాణాలు హరించే వాటిల్లో తొలి రెండు స్థానాల్లో గుండెపోటు, క్యాన్సర్ ఉండగా దాని అనంతరం కూడా అతి నిద్ర వల్ల వచ్చే గుండె పోటేనని చెప్తున్నారు. ప్రతి ఏడాది బ్రిటన్ లో దాదాపు లక్షమంది గుండెపోటుకు గురవుతుండగా వీరిలో సగానికిపైగా అతి నిద్రకు అలవాటైన వారే ఉన్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ పరిశోధనను అమెరికాకు చెందిన న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన అధ్యయనకారులు చేశారు. ఎంత లేదన్నా...కనీసం రోజుకు 30-60 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి సురక్షితం అని చెప్పారు.





Untitled Document
Advertisements