అప్పు అడిగినందుకు అనంత లోకాలకు...

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 03:50 PM

అప్పు అడిగినందుకు అనంత లోకాలకు...

మంగళూరులో ఆదివారం చోటు చేసుకున్న మహిళ దారుణహత్య కేసును పోలీసులు ఛేదించారు. అప్పు అడిగినందుకే హతమార్చి నట్లు గుర్తిం చారు. మంగళాదేవి ప్రాంతం అమర్‌ అళ్వా రోడ్డు నివాసి శ్రీమతి శెట్టి (37)ని గత శనివారం దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తల, మొండెం వేరు చేసి పడవేసిన సంఘటన అదే రోజు వెలుగులోకి వచ్చింది.

కేసును పరిశీలిస్తున్న పోలీసులు సూటర్‌పేట జోనస్‌ శ్యామ్సన్‌, అతడి భార్య విక్టోరియాలను అరెస్టు చేశారు. శ్రీమతి శెట్టి నుంచి జోనస్‌ లక్ష రూ పాయలు అప్పు తీసుకున్నారు. ఇప్పటికి రూ.40 వేలు వాపసు ఇవ్వగా మరో 60వేలు బకాయి ఉంది. గత శనివారం అప్పు చెల్లించాలని శ్రీమ తిశెట్టి, జోనస్‌ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టెతో తల పై బాది హతమార్చారు.

ఆ రోజు రాత్రంతా శవాన్ని ఇంట్లో ఉంచుకుని ముక్కలుగా చేసి నగరంలోని వివిధ ప్రాంతాలలో పడేశారు. ఆదివారం ఉదయం మహిళ దేహాన్ని వివిధ ప్రాంతాలలో గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపారు. అరెస్టు అనివార్యమని భా వించి జోనస్‌ ఆత్మహత్యకు యత్నించాడు. దీం తో సునాయాసంగా పోలీసులు అరెస్టు చేశారు. అతడినుంచి హత్యకు గురైన శెట్టికి సంబం ధించిన బంగారు చైను, ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు. జోనస్‌కు సహకరించిన భార్య విక్టోరియాను అరెస్టు చేశారు.

Untitled Document
Advertisements