ఉపాసన, సమంత లకు అక్కినేని అమల ఛాలెంజ్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 03:54 PM

ఉపాసన, సమంత లకు అక్కినేని అమల ఛాలెంజ్

సోషల్ మీడియాలో ఇటీవల సామాజిక చైతన్యం కోణంలో పలు చాలెంజ్ లు తెరపైకి వచ్చాయి. రైస్ బకెట్ చాలెంజ్, ఫిట్ నెస్ చాలెంజ్ పేరుతో నెటిజన్లలో చైతన్యం తీసుకువచ్చే పలు చాలెంజ్ లు ఎంతో ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న చాలెంజ్ 'రీడింగ్ ఈజ్ గుడ్ చాలెంజ్'. ఇది పుస్తకపఠనం వ్యవహారానికి సంబంధించినది. రామ్ ప్రసాద్ అనే వ్యక్తి ట్విట్టర్ లో తనను ఈ చాలెంజ్ కు నామినేట్ చేయగా, బ్లూక్రాస్ చీఫ్ అక్కినేని అమల సంతోషంగా యాక్సెప్ట్ చేశారు. ఈ చాలెంజ్ ను స్వీకరిస్తూ, అందులో భాగంగా 'స్టోరీస్ ఎట్ వర్క్' అనే పుస్తకాన్ని చదువుతానని వెల్లడించారు. అంతేకాకుండా, తనవంతుగా సమంత, ఉపాసనలను ఈ చాలెంజ్ కు నామినేట్ చేశారు. ఈ మేరకు అమల ట్విట్టర్ లో వివరాలు తెలిపారు.

Untitled Document
Advertisements