ఒకే స్క్రీన్ పై అనుష్క, ఐశ్వర్యారాయ్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 03:58 PM

ఒకే స్క్రీన్ పై అనుష్క, ఐశ్వర్యారాయ్

ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఓ హిస్టారికల్ మూవీని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. చోళ రాజుల కాలంలో నడిచే కథతో ఆయన తన కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. పొన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ కథను మణిరత్నం రూపొందించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, జయం రవి, అనుష్క, కీర్తి సురేష్ నటించనున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ కూడా ఓ కీలక పాత్రను పోషించబోతోంది. విలన్ క్యారక్టర్ లో ఆమె కనిపించనుందని, ఈ పాత్రే కథను కీలక మలుపు తిప్పుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

Untitled Document
Advertisements