భారతరత్న అవార్డుకు.... గాడ్సే పేరు?: ఒవైసీ

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 04:11 PM

భారతరత్న అవార్డుకు.... గాడ్సే పేరు?: ఒవైసీ

గాంధీని చంపిన గాడ్సే ఓ దేశభక్తుడు అంటూ బీజేపీ నేత, భోపాల్ లోక్ సభ స్థానం అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. "ఇదేదో పిచ్చితనంతో చేసిన వ్యాఖ్య కాదు, ఆమె వ్యక్తిగత అభిప్రాయం అంతకన్నా కాదు. స్వతంత్ర భారతదేశపు మొదటి ఉగ్రవాదిపై బీజేపీ వైఖరినే సాధ్వీ ప్రజ్ఞా తన మాటల ద్వారా వెల్లడించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెనకేసుకురావడమే కాదు, ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా నరేంద్ర మోదీ బలపరుస్తున్నారు. మరికొన్నేళ్లలో వీళ్లు శ్రీ గాడ్సే గారి పేరు భారతరత్న అవార్డుకు కూడా సిఫారసు చేస్తారు... చూస్తూ ఉండండి" అంటూ ట్వీట్ చేశారు.

Untitled Document
Advertisements