గాంధీని చంపిన గాడ్సే ఒక దేశ భక్తుడు: సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 04:14 PM

గాంధీని చంపిన గాడ్సే ఒక దేశ భక్తుడు: సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్

మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీని చంపిన నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడని అన్నారు. గాడ్సే తొలి హిందూ ఉగ్రవాది అంటూ కమలహాసన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఆమె ఈ మేరకు స్పందించారు. గాడ్సేను ఉగ్రవాదితో పోల్చిన వ్యక్తులకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ ఏ1గా ఉన్నారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు.

Untitled Document
Advertisements