విడుదలకు ముస్తాబవుతున్న 'సీత'

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 04:29 PM

విడుదలకు ముస్తాబవుతున్న 'సీత'

కాజల్ ప్రధాన పాత్రధారిగా తేజ దర్శకత్వంలో 'సీత' రూపొందింది. కాజల్ జోడీగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి 'యు' సర్టిఫికేట్ ను మంజూరు చేశారు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సోనూ సూద్ నటించాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో తేజ మాట్లాడుతూ.... ఈ పాత్ర తానే చేస్తానని కాజల్ పట్టుబట్టినట్టుగా చెప్పాడు. ఈ పాత్ర ఆమె కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దాంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.

Untitled Document
Advertisements