సినిమా అంతా ఒకే డైలాగా అనుకున్న...కాని

     Written by : smtv Desk | Thu, May 16, 2019, 04:33 PM

సినిమా అంతా ఒకే డైలాగా అనుకున్న...కాని

ఈ మధ్య కాలంలో భారీ విజయాన్ని సాధించిన చిత్రాల జాబితాలో 'ఎఫ్ 2' కూడా కనిపిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు ప్రదీప్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. ఆ సినిమాలో ఆయన చెప్పిన 'అంతేగా .. అంతేగా' డైలాగ్ ఎంతో పాప్యులర్ అయింది.

ఆ విషయాన్ని గురించి తాజాగా ప్రదీప్ మాట్లాడుతూ .. "అనిల్ రావిపూడి నన్ను కలిసినప్పుడు ' ఈ సినిమాలో మీకో వేషం వుంది చేయాలి' అన్నారు. 'ఏ వేషం?' అని నేను అడిగితే, 'తమన్నా ఫాదర్ వేషం .. సినిమా అంతా ఉంటుంది' అన్నాడు. 'కొన్ని రోజుల తరువాత సినిమా అంతా ఒకే డైలాగ్ ఉంటుంది సార్' అని చెప్పాడు. దాంతో నేను ఆలోచించాను .. చేయవచ్చా అని భయపడ్డాను కూడా. అది గమనించిన అనిల్ రావిపూడి, థియేటర్ నుంచి బయటికి వచ్చే ఆడియన్స్ .. మీ డైలాగే చెప్పుకుంటూ వస్తారండి' అన్నాడు. నిజంగా ఆయన చెప్పినట్టుగానే జరిగింది" అని చెప్పుకొచ్చారు.

Untitled Document
Advertisements