అమెజాన్ ను భారత్ లో బాయ్ కాట్ చేయాలి

     Written by : smtv Desk | Fri, May 17, 2019, 06:51 PM

అమెజాన్ ను భారత్ లో బాయ్ కాట్ చేయాలి

ఈ కామర్స్ వెబ్‌సైట్ అమేజాన్ మరోమారు వివాదంలో చిక్కుకుంది. హిందూ మతానికి సంబంధించిన దేవుళ్లు, దేవతల బొమ్మలున్న పలు డోర్‌మ్యా‌ట్‌ లను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టింది. ఈ విషయం మీద పెద్ద దుమారం రేగి ట్విట్టర్ లో పెద్ద యుద్దమే జరుగుతోంది. డోర్ మ్యాట్ ల పై హిందూ దేవుళ్ళు అయిన శివుడు, విష్ణువు, కృష్ణుడు, వినాయకుడు, లక్ష్మీదేవి, హిందువులు పవిత్రంగా పూజించే దేవుళ్ల చిత్రాలను డోర్ మ్యాట్ లపై చిత్రించి తమ విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని, కించపరుస్తున్నారని అందుకే అమెజాన్ ను భారత్ లో బాయ్ కాట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చాలా మంది ఇదే విషయాన్ని పేర్కొంటూ అమెజాన్ ప్రెసిడెంట్ పి.బెజోస్ ఈ విషయంపై హిందువులకు క్షమాపణ చెప్పాలని, దేవుళ్ల చిత్ర పటాలున్న మ్యాట్ లను ఆన్ లైన్ నుంచి వెంటనే తీసెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే వీరు ఇలా చేయడం ఇదేం మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలానే జరిగింది. తాజాగా ఈ విషయం మీద స్పందించిన యోగా గురు బాబా రామ్ దేవ్ బాయ్కాట్ ఆమెజాన్ అనే హ్యాష్ ట్యాగ్ తో అమెజాన్ హిందూలకి క్షమాపణ చెప్పాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. అలాగే ఇంతకుముందు హిందూస్తాన్ యూనిలివర్ కూడా ఒక యాడ్ విషయంలో ఇలానే విమర్శలు ఎదుర్కొని తన సేల్స్ విషయంలో ఇబ్బంది పడింది. ఇక ఇప్పుడు ఆమెజాన్ వంతు వచ్చింది.





Untitled Document
Advertisements