రోమ్ మాస్టర్స్ టోర్నీ....సెమీఫైనల్లోకి నొవాక్ జొకోవిచ్

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 10:34 AM

రోమ్ మాస్టర్స్ టోర్నీ....సెమీఫైనల్లోకి నొవాక్ జొకోవిచ్

రోమ్: రోమ్ మాస్టర్స్ టోర్నీలో సెమీఫైనల్లోకి టెన్నిస్ దిగ్గజ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ ఎంట్రీ ఇచ్చాడు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ మాజీ యుఎస్ చాంపియన్, అర్జెంటీనాకు చెందిన డెల్‌పోట్రోపై 4 6, 7 6(8 6),6 4 తేడాతో విజయం సాధించాడు. మొదటి సెట్‌ను గెలిచిన పో ట్రో రెండో సెట్‌లోను అదే దూకుడు ప్రదర్శించాడు. బేస్‌లైన్ షాట్లు ఆడుతూ ప్రత్యర్థికి చుక్క లు చూపించాడు. అయితే రెండు మ్యాచ్ పా యింట్లను కాపాడుకున్న జొకోవిచ్ మ్యాచ్‌ను టైబ్రేకర్ దాకా తీసుకెళ్లాడు. టైబ్రేకర్‌లో 8 6 పాయింట్లతో గెలిచి రెండో సెట్‌ను తన ఖాతా లో వేసుకున్న జొకోవిచ్ రెట్టించిన ఆత్మ విశ్వాసంతో మూడో సెట్ కూడా గెలిచి సెమీఫైనల్లో ప్రవేశించాడు. సెమీఫైనల్లో మరో అర్జెంటీనా ఆ టగాడు డియాగో ష్వార్ట్‌మాన్‌తో తలపడతా డు. కాగా అదృష్టంతోనే తాను గట్టెక్కానని మ్యాచ్ అనంతరం జొకోవిచ్ అన్నాడు. సరయి న సమయంలో అదృష్టం తనకు అండగా నిలిచిందని, రెండో సెట్‌లో తాను రెండు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం తనలో ఆత్మవిశ్వాసం కలిగించిందని చెప్పాడు. ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత తన ఆట కాస్త గాడి తప్పిందని అంటూ ఈ మ్యాచ్‌తో మళ్లీ తన పూర్వపు ఫామ్‌ను అందుకున్నట్లు భావిస్తున్నానని చెప్పాడు.





Untitled Document
Advertisements