సొంత గడ్డపై ఈ సారైనా మెరిసేనా

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 11:30 AM

సొంత గడ్డపై ఈ సారైనా మెరిసేనా

లండన్: మే 30న ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్ టోర్నీలో సత్తా చాటే జట్లల్లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో నిలుస్తుంది. మిగతా జట్లతో పోలిస్తే ఈ జట్టు వన్‌డే ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తూ అగ్రస్థానానికి ఎగసింది. గత రెండేళ్లుగా ఈ జట్టు అద్భుత విజయయాలు సాధించింది. జో రూట్, జానీ బెయిర్‌స్టో, జాసన్ రాయ్, జోస్ బట్లర్‌లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంత దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ మరే జట్టుకూ లేదు. అయితే సొంత గడ్డపై జరిగిన మూడు ప్రపంచకప్ టోర్నమెంట్లలో కూడా ఆ జట్టు ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. రెండు సార్లు సెమీఫైనల్‌కు, ఒక సారి ఫైనల్‌కు చేరింది. ఈ సారి కూడా సొంత ప్రేక్షకుల ముందు చెలరేగాలని ఆ జట్టు విపరీతమైన కసితో ఉంది. అన్నీ కలిసి వస్త్తే ఇంగ్లాండ్ జట్టు విశ్వ విజేతగా నిలిచినా ఆశ్చర్యపోవలసిన పని లేదు.
జట్టు : మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, బెయిర్‌స్టో, జోస్ బట్లర్, టామ్ కరన్, జో డెన్లీ, లిమ్ ప్లంకెట్, ఆదిల్ రషీద్, జో రూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లే, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. కోచ్ : ట్రేవర్ బేలిస్.





Untitled Document
Advertisements