యురోపియన్ యూనియన్ తీరు పై ట్రంప్ ఆగ్రహం

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 11:47 AM

యురోపియన్ యూనియన్ తీరు పై ట్రంప్ ఆగ్రహం

వాషింగ్టన్: అమెరికా పట్ల యురోపియన్ యూనియన్ తీరు దారుణంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇతర దేశాలతో వాణిజ్య పరంగా ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్న ట్రంప్ ఇప్పుడు ఆటోమొబైల్స్ విడిభాగాలపై టారీఫ్‌ల విషయంలో దిగివచ్చారు. ఆటోమొబైల్ విడిభాగాలపై పన్నులను మరో ఆరునెలలు వాయిదా వేయనున్నట్లు ప్రకటించారు. జపాన్, యూరప్‌లు చర్చలకు సిద్ధం కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ యూరప్, జపాన్‌లతో పన్నుల విషయంలో కొంత వెసులుబాటు ఇచ్చారు. 180 రోజుల్లోపు ఇయు, జపాన్, ఇతర దేశాలతో జరిపిన వాణిజ్య చర్చల ఫలితాలను వెల్లడించాలని పేర్కొన్నారు.ఇప్పటికే తమ దేశాల నుంచి ఎగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై అమెరికా టారీఫ్‌లు విధించడంపై యూరోపియన్ యూనియన్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు అమెరికాను చైనాకంటే దారుణంగా చూస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించగా, గత ఏడాది దీనిపై ఒక సంధి ప్రతిపాదన చేశారు. ఇయు కమిషన్ అధ్యక్షుడు జేన్ క్లాడ్ జంకర్‌తో కలిసి దీనిని ట్రంప్ ప్రకటించారు. ఇటీవల 200 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై పన్నులను 25 శాతానికి పెంచిన ట్రంప్ చైనా ఆగ్రహానికి గురయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత అధ్వాన్నంగా మారాయి.





Untitled Document
Advertisements