విడుదలకు సిద్దమైన టొయోటా‘గ్లాన్జా’

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 12:52 PM

విడుదలకు సిద్దమైన టొయోటా‘గ్లాన్జా’

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ టొయోటా వచ్చే నెలలో తన సరికొత్త కారు ‘గ్లాన్జా’ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటుంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. టొయోటా సరికొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది. జూన్ 6వ తేదీన మార్కెట్లోకి ఈ కారును విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. మారుతీ సుజుకీతో ఒప్పందంలో భాగంగా టొయోటా ఉత్పత్తి చేసేందుకు అంగీకరించిన మూడు మోడళ్లలో బాలెనో కూడా ఒకటి. టీజర్‌లో కనిపించిన దాని ప్రకారం బాలినోలో వాడిన అలాయ్ వీల్స్‌నే దీనికి కూడా వినియోగించినట్లు తెలుస్తోంది. వీటిపై టొయోటా లోగో ఉంది. కొత్త కారులో స్లేట్ క్రోమ్ గ్రిల్స్‌ను అమర్చారు.





Untitled Document
Advertisements