తలపాగా ధరిస్తే నో ఎంట్రీ!

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 01:08 PM

తలపాగా ధరిస్తే నో ఎంట్రీ!

వాషింగ్టన్: అమెరికాలో ఓ సిక్కు యువకుడు తలపాగా ధరించి బార్‌లోకి వెళ్తే అతన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. అర్థరాత్రి దాటిన తన స్నేహితుడి కలుసుకోవడానికి వెళ్లిన ఆ యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్లు మీడియా పేర్కొంది. గురువీందర్‌ గ్రేవల్‌ అనే యువకుడు అర్థరాత్రి తర్వాత తలపాగాతో పోర్ట్‌ జెఫర్‌సన్‌లోని హర్బర్‌ గ్రిల్‌ బార్‌కి వెళ్లాడు. అక్కడి భద్రతా సిబ్బంది తలపాగా ఉన్న కారణంగా అతడిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇది తమ సాంప్రదాయం అని మేనేజర్‌కి వివరించిన ప్రవేశానికి అమనుతించలేదని గురువీందర్‌ తెలిపారు. అయితే ఈ ఘటన తర్వాత హర్బర్‌ గ్రిల్‌ ఫేస్‌బుక్‌లో క్షమాపణలు తెలపడంతో పాటు వివరణ ఇచ్చింది. శుక్రవారం, శనివారం రాత్రి పది గంటల తర్వాత టోపీలు, హ్యాట్‌లు ధరించిరావడంపై నిషేధం విధించామని, అంతేకానీ సాంప్రదాయంగా ధరించేవాటిపై ఎలాంటి నిషేధం లేదని చెప్పుకొచ్చింది.





Untitled Document
Advertisements