లాభాల్లో దూసుకెళ్తున్న డా.రెడ్డీస్

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 03:49 PM

లాభాల్లో దూసుకెళ్తున్న డా.రెడ్డీస్

హైదరాబాద్: ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ సంస్థ మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో(క్యూ4) నికర లాభం రూ.434 కోట్లతో 44 శాతం వృద్ధిని సాధించింది. పోయిన ఏడాది ఇదే సమయంలో సంస్థ లాభం రూ.302 కోట్లుగా ఉంది. అయితే క్యూ3తో పోలిస్తే నికర లాభం 10 శాతం తగ్గింది. హైదరాబాద్‌కు చెందిన కంపెనీల మొత్తం ఆదాయం రూ. 4016.6 కోట్లతో 14 శాతం వృద్ధిని సాధించింది. కంపెనీ సిఇఒ, కొచైర్మన్ జివి ప్రసాద్ మాట్లాడుతూ, గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ గణనీయమైన లాభాలను నమోదు చేసిందని, స్థిరంగా వృద్ధిని సాధించిందని అన్నారు. సంస్థ ఎబిటా మార్జిన్ 2017-18 క్యూ4లో 16.3 శాతం, తాజాగా 22 శాతంగా నమోదైంది. కంపెనీ స్థూల లాభాల మార్జిన్ 52.4 శాతంగా నమోదయింది. క్యూ3తో పోలిస్తే ఈ మార్జిన్లు 150 బిపిఎస్ తగ్గాయి. ఫారెక్స్ రేట్‌లో కదలికలు, వ్యాపార మిశ్రమంలో మార్పులు, ఉత్పత్తికి సంబంధించి ప్రతికూల పరిస్థితులు, నిల్వ సరుకు ప్రభావం తదితరాల కారణంగా మార్జిన్లు తగ్గాయని కంపెనీ పేర్కొంది. ఒక్కో షేరుపై రూ.20 డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 3 శాతం పతనమై రూ.2,725 వద్ద స్థిరపడింది.





Untitled Document
Advertisements