షోయబ్ హిట్‌వికెట్...కామెంట్లు చేస్తున్న నెటిజన్లు

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 05:06 PM

షోయబ్ హిట్‌వికెట్...కామెంట్లు చేస్తున్న నెటిజన్లు

లండన్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ ను పాక్ చేజార్చుకుంది. నాటింగ్ హామ్ లో జరిగిన నాలుగో వన్డేలో ఆతిథ్య జట్టు చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో పాక్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ విచిత్రంగా హిట్‌వికెట్ కోల్పొయాడు. ఆ వీడియా ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. అప్పటి వరకు దూకుడుగా ఆడుతున్న షోయబ్ వ్యక్తిగత స్కోరు 41 (26 బంతుల్లో 4ఫోర్లు) వద్ద మార్క్‌వుడ్ బౌలింగ్‌లో హిట్‌వికెట్‌గా ఔట్ అయ్యాడు.మార్క్ వేసిన బంతి స్కేర్‌కట్ చేసే క్రమంలో క్రీజులోనే కొన్ని అడుగులు వెన‌క ఉన్న‌ మాలిక్ షాట్ ఆడుతుండగా బ్యాట్‌తో స్టంప్స్ కొట్టేశాడు. దీంతో అతను నిరాశగా పెవిలియన్ వెనుదిరిగాడు. అప్పటికే పాకిస్థాన్ స్కోరు 300 క్రాస్ చేసింది. ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాలన్న అతడి ఆశ కలగానే మిగిలింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ట్రోల్ అవుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ వేస్తున్నారు. వరల్డ్ కప్ ముంగిట పాక్, ఇంగ్లాండ్ జట్లకు ఆదివారం ఐదో వన్డే మ్యాచ్ జరగనుంది.





Untitled Document
Advertisements