అవే నాకు ఆదర్శం: జెఫ్‌ బేజోస్

     Written by : smtv Desk | Sun, May 19, 2019, 05:19 PM

అవే నాకు ఆదర్శం: జెఫ్‌ బేజోస్

వాషింగ్టన్‌: స్టాట్యూ ఆఫ్‌ లిబర్టి కొత్త ప్రారంభోత్సవం సందర్భంగా అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బేజోస్ తన తండ్రి గురించి పలు విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన 16వ ఏట నా తండ్రి క్యూబా నుంచి అమెరికా వలస వచ్చారు. అప్పుడు ఆయనకు స్పానిష్‌ తప్ప మరో భాష తెలీదు. కానీ ఇవేవి ఆయనను అమెరికా కల నుంచి దూరం చేయలేకపోయాయి. సంకల్పం, దీక్ష, ఆశావాద దృక్పథం ఆయనను నిరంతరం తన గమ్యం వైపు నడిపించేవి. అవే నాకు ఆదర్శం. కష్టకాలంలో ప్రజలు ఒకరికి ఒకరు బాసటగా ఎలా నిలుస్తారనే అంశాన్ని నా తండ్రి అమెరికా ప్రయాణం చూస్తే అర్థం అవుతుంది. స్టాట్యూ ఆఫ్‌ లిబర్టి కొత్త మ్యూజియం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ప్రయాణాన్ని మరోసారి గుర్తు తెచ్చుకునే అవకాశం లభించింది అని అన్నారు.





Untitled Document
Advertisements