బోయింగ్ 737 మ్యాక్స్ లోపాల సవరణ పూర్తి

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 11:27 AM

బోయింగ్ 737 మ్యాక్స్ లోపాల సవరణ పూర్తి

వాషింగ్టన్: ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ తన 737 మ్యాక్స్ విమానంలోని సిమ్యులేటర్‌లో ఉన్న లోపాన్ని సరిచేసినట్లు శనివారం ప్రకటించింది. ఈ రకం విమానం రెండు భారీ ప్రమాదాలకు కారణమై 346 మంది ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే.‘ బోయింగ్ 737 మ్యాక్స్ సిమ్యులేటర్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యను సరిచేశాం. ఈ రకం విమానాలను నిర్వహిస్తున్న వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేశాం. వివిధ పరిస్థితుల్లో కూడా సక్రమంగా పని చేసేలా దీన్ని రూపొందించాం. ఈ మార్పుల్లో భాగంగా సిమ్యులేటర్ తయారీదారులతో కలిసి పని చేశాం. దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తాం’ అంటూ బోయింగ్ ఒక ప్రకటన విడుదల చేసింది.





Untitled Document
Advertisements