ఇంటివాడైన హనుమ విహారి

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 11:35 AM

ఇంటివాడైన హనుమ విహారి

హన్మకొండ: టీమిండియా ఆటగాడు హనుమ విహారి ఆదివారం వరంగల్‌కు చెందిన ప్రీతిరాజ్‌తో వివాహమాడాడు. వీరి వివాహం హన్మకొండలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విహారి ప్రస్తుతం టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, సోమవారం హైదరాబాద్‌లో విహారి ప్రముఖులకు వివాహ విందు ఇవ్వనున్నాడు. ఈ విందులో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.





Untitled Document
Advertisements