’సీడ్స్ మదర్ ‘ కు కేన్స్‌ లో బహుమతి

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 11:37 AM

’సీడ్స్ మదర్ ‘ కు కేన్స్‌ లో బహుమతి

పారిస్‌: ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ కేన్స్‌ చలన చిత్రోత్సవంలో భారత్ కు చెందిన ’సీడ్స్ మదర్ ‘ అనే మహిళా రైతు సినిమా తృతీయ బహుమతిని సొంతం చేసుకుంది. మూడు నిమిషాల నిడివి గల ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు అచ్యుతానంద ద్వివేది కేన్స్‌లో ప్రదర్శించారు. మహారాష్ట్రకు చెందిన రహీబాయి సోమా అనే మహిళా రైతు జీవిత నేపథ్యంలో ఈ లఘు చిత్రాన్ని తీశారు. రహీబాయి స్థానికంగా లభించే విత్తనాలతో సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించేవారు. దీంతో ఆమె బిబిసి టాప్ 100 మంది స్పూర్తిదాయకమైన మహిళల్లో మూడో స్థానం సాధించారు. రహీబాయి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిందు చేతుల మీదుగా కూడా అవార్డు అందుకున్నారు. దీంతో రహీబాయి దేశ వ్యాప్త గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలో దర్శకుడు అచ్యుతానంద్ తన ఇంట్లోని పెరటిలో విత్తనాలను నాటేందుకు రహీబాయిన సాయం కోరాడు. ఆమె చేస్తున్న సంప్రదాయ వ్యవసాయంపై ఆయనకు ఆసక్తి పెరిగింది. దీంతో ఆమె జీవిత నేపథ్యంలో ’సీడ్ మదర్ ‘ లఘు చిత్రాన్ని తీశాడు. మిర్రర్ లెన్స్ తో ఈ లఘు చిత్రాన్ని తీశాడు. ఇదిలా ఉండగా ఈ ఏడాది కేన్స్ లో ప్రదర్శించేందుకు భారతీయ చిత్రాలు ఏవీ కూడా ఎంపిక కాలేదు. అయితే సీడ్ మదర్ కేన్స్ లో ప్రదర్శించడంపై దేశ వ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది కేన్స్ థీమ్ ’వుయ్ ఆర్ వాట్ వుయ్ ఈట్ ‘.ఆహార పదార్థాలు, వాటిని పండిచే విధానం నేపత్యంలో తీసిన సినిమాలను మాత్రమే ప్రదర్శిస్తారు. అయితే ఈ ఏడాది 47 దేశాల నుంచి 371 లఘు చిత్రాలు కేన్స్ కు వెళ్లాయి. ఈ క్రమంలో భారత్ కు చెందిన ’సీడ్ మదర్‘ కూడా కేన్స్ లో ప్రదర్శించారు.





Untitled Document
Advertisements