స్టాక్ మార్కెట్: నేడు లాభాలతో ప్రారంభం

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 12:24 PM

స్టాక్ మార్కెట్: నేడు లాభాలతో ప్రారంభం

ముంభై: సోమవారం ఉదయం దేశీ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 38,819 తో ప్రారంభమై..888 పాయింట్లతో దూసుకుపోతోంది. ఇక 11,691 పాయింట్లతో ఆరంభమైన నిఫ్టీ284 పాయింట్ల ఆరంభ ట్రేడ్ తో లాభాలతో దూసుకుపోతోంది. అయితే ఈ వారం లాభాలతో ఆరంభమైనప్పటికీ.. వారం ప్రారంభంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. గురువారం 23వ తేదీన వెలువడే తుది ఫలితాలు దీంతో పాటు ఈ వారంలో క్యూ4 ఫలితాలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయి. అతి పెద్దకంపెనీల ఫలితాల విషయానికి వస్తే టాటామోటార్స్‌, కెనరా బ్యాంకు, సిప్లా ఫలితాలు వెల్లడికానున్నాయి.





Untitled Document
Advertisements