ఏటీఎంలో ఇన్ని సేవలా!

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 12:25 PM

ఏటీఎంలో ఇన్ని సేవలా!

న్యూఢిల్లీ: ఏటీఎం అనగా ముందు గుర్తొచ్చేది మనీ విత్‌డ్రా. దాదాపు అందరూ ఈ ఒక్క సేవ కోసమే అనేక మంది ఏటీఎంను వాడుతారు. కాని ఈమధ్య కాలంలో నగదు డిపాజిట్‌కు కూడా ఏటీఎంలను ఎక్కువగా ఉపయోగిస్తు్నాయి. అయితే కేవలం ఈ రెండు సేవలు మాత్రమే కాదు. ఏటీఎంలలో ఇంకా చాలా సర్వీసులు పొందొచ్చు. అవేంటో చూద్దాం.. ✺ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రారంభించొచ్చు. ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే ఓపెన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఆప్షన్ ఎంచుకొని ఈ సేవలు పొందొచ్చు. ఇక్కడ ఎంత కాలానికి డిపాజిట్ చేస్తున్నారు.. ఎంత మొత్తం డిపాజిట్ చేస్తారు అనే వివరాలు కూడా అందించాల్సి ఉంటుంది.
✺ ఏటీఎంలలో మొబైల్ నెంబర్‌ను రీచార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల మొబైల్ నెంబర్లను కూడా రీచార్జ్ చేసేయవచ్చు. ఇందుకోసం ఏటీఎం స్క్రీన్‌పై మొబైల్ రీచార్జ్ ఆప్షన్ ఎంచుకోవాలి.
✺ పన్ను కూడా చెల్లించొచ్చు. కొన్ని బ్యాంకులు ఏటీఎం నుంచే ఆదాయపు పన్ను చెల్లింపు సౌకర్యాన్ని అందిస్తున్నాయి. అడ్వాన్స్‌డ్ ట్యాక్స్, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్, ట్యాక్స్ డ్యూ వంటి సేవలు పొందొచ్చు. ఈ సేవల కోసం ముందుగా బ్యాంక్ బ్రాంచ్ లేదా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
✺ ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేయవచ్చు. చాలా బ్యాంకులు ఈ సేవలు అందిస్తున్నాయి. రూ.100, రూ.500, రూ.2,000 నోట్లను ఏటీఎం మెషీన్‌లో డిపాజిట్ చేయవచ్చు.
✺ ఏటీఎం సాయంతో ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లించవచ్చు. ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ వంటి కంపెనీలు బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. దీంతో పాలసీ ప్రీమియాన్ని ఏటీఎం నుంచే కట్టేయవచ్చు.





Untitled Document
Advertisements