రిటైరయ్యే ఆలోచనలో యువీ!

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 12:27 PM

రిటైరయ్యే ఆలోచనలో యువీ!

ముంభై: టీంఇండియా సంచలన ఆటగాడు యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి, ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి రిటైరయ్యే దిశగా సీరియస్‌గా ఆలోచిస్తున్నాడని సమాచారం. విదేశాల్లో టీ20 లీగ్‌లు ఆడే దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ నుంచి అనుమతి కోరబోతున్నాడని సమాచారం. ఐసీసీ అనుమతించిన విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతిస్తేనే.. యువీ రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కెనడా జీటీ20; యూరో టీ20 స్లామ్ లాంటి ఈవెంట్లలో ఆడే దిశగా యువీ అడుగులేస్తున్నాడు. యువీ ఐపీఎల్‌ 2019లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడినప్పటికీ ఎక్కువ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం రాలేదు. దీంతో తన భవిష్యత్తు గురించి యువరాజ్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. భారత్ 2011 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యువీ.. క్యాన్సర్‌తో పోరాడి గెలిచాడు. కానీ క్రికెట్లో మాత్రం మునుపటి ఆటతీరు కనబర్చలేకపోయాడు. ఐపీఎల్‌లో ఆడుతున్నప్పటికీ అంతగా సత్తా చాటలేకపోయాడు. దీంతో బిగ్ బాష్, సీపీఎల్, బీపీఎల్ లాంటి లీగ్‌ల్లో ఆడటానికి ఆసక్తి చూపుతున్నాడు. జహీర్, వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో క్రికెట్ అకాడమీ నడిపే యోచనలోనూ యువీ ఉన్నట్టు తెలుస్తోంది.





Untitled Document
Advertisements