భార్యను అవమానించాడని సోదరుడి ప్రాణం తీసిన వైనం

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 01:11 PM

భార్యను అవమానించాడని సోదరుడి ప్రాణం తీసిన వైనం

బ్రిటన్‌కు చెందిన ఓ కుటుంబం పార్టీ చేసుకుందామని మిత్రులతో కలిసి బయటకు వెళ్లింది. పార్టీ ముగించుకొని తిరిగి వస్తుండగా.. ఆ కుటుంబానికి చెందిన లీ, కార్ల్ ఎల్డ్రెడ్ అనే సోదరుల మధ్య వాగ్వివాదం మొదలైంది. వారిని ఆపడానికి వారి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇంతలో కార్ల్ భార్యను లీ అవమానించాడు. దీంతో చిర్రెత్తిన కార్ల్, లీ తలపై కొట్టాడు.

అసలే....మత్తు ఎక్కువైపోయి ఉన్న లీకి ఆ దెబ్బలు చాలా బలంగా తగిలాయి. అంతే కూర్చున్న చోటే కళ్లు తేలేశాడు. అదే వాహనంలోని వారు..... వెంటనే అతనికి ప్రథమ చికిత్స చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. లీ ఊపిరి తీసుకోవడం కూడా ఆగిపోవడం గమనించిన వారి మిత్రులు అతనికి కృత్రిమ శ్వాస ఇవ్వడానికి ప్రయత్నించారు.

అయినా ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో అతన్ని హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆ సోదరులిద్దరి మధ్య గట్టి అనుబంధం ఉండేదని, స్వహస్తాలతో అన్న ప్రాణాలు తీసినందుకు కార్ల్ తనను తాను క్షమించుకోలేడని వారి తల్లిదండ్రులు కోర్టుకు చెప్పారు. మద్యం మత్తు ఎక్కువ కావడం కూడా లీ మరణానికి కారణమని వైద్యులు చెప్పడంతో.. కోర్టు కార్ల్‌కు నాలుగేళ్ల కారాగార శిక్ష విధించింది.





Untitled Document
Advertisements