స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌ ఓ లెస్బియన్!

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 01:47 PM

స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌ ఓ లెస్బియన్!

భువనేశ్వర్‌: ప్రముఖ స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌ తాను స్వలింగ సంపర్కురాలినని తాజాగా ప్రకటించింది. గత కొంత కాలంగా తమ గ్రామంలో ఉన్న ఓ అమ్మాయితో రిలేషన్ షిప్ లో ఉన్నట్టు, అలాగే తననే వివాహం చేసుకోనున్నట్టు ద్యుతి చెప్పారు. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ తరువాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఆమె పేర్కొన్నారు. తమ పెళ్లికి ఇరువురి కుటుంబాలను ఒప్పిస్తామన్న నమ్మకం తనకు ఉందని ద్యుతి తెలిపారు. అయితే ద్యుతి నిర్ణయాన్ని ఆమె తల్లి అకుజి చంద్ వ్యతిరేకిస్తున్నారు. ద్యుతి నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో తమ కుటుంబంతో ఆమె బంధాన్ని తెంచుకుందని అకుజి చంద్ వెల్లడించారు. ద్యుతి ప్రేమించిన అమ్మాయి తమకు మనవరాలు అవుతుందని, మనవరాలితో ద్యుతి పెళ్లి ఎలా జరిపిస్తామని అకుజి చంద్ ప్రశ్నించారు. ద్యుతి నిర్ణయాన్ని తమ కుటుంబమే కాదు, తమ గ్రామంలోని ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారని అకుజి పేర్కొంది. ఈ క్రమంలో ద్యుతి నిర్ణయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Untitled Document
Advertisements