స్టీల్‌బర్డ్‌ నయా హేల్మేట్స్

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 01:56 PM

స్టీల్‌బర్డ్‌ నయా హేల్మేట్స్

స్టీల్‌బర్డ్‌ తాజాగా మార్కెట్లోకి ఎస్‌బీ 51 ర్యాలీ హెల్మెట్లను తీసుకొచ్చింది. ఎస్‌బీ 51 హెల్మెట్ డిజైన్ చాలా ప్రత్యేకం. దీని ధర రూ.1,399 నుంచి ప్రారంభమవుతూ అదిరిపోయే రంగుల్లో లభ్యమౌతున్నాయి. ఇక ఈ హెల్మెట్ల గరిష్ట ధర రూ.1,599. ఈ హెల్మెట్లు 560 ఎంఎం, 580 ఎంఎం, 600 ఎంఎం సైజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉన్నాయి. హెల్మెట్ వెనుక భాగం ఇతర హెల్మెట్ల మాదిరే రెగ్యులర్‌గానే ఉంటుంది. ముందు భాగంలో వన్‌సైడ్ ప్రొటెక్టివ్ లేయర్‌ను చూడొచ్చు. ఇది గాలి శబ్దాన్ని నిలువరిస్తుంది. హెల్మెట్ విజర్ కూడా స్పష్టంగా ఉంది. హెల్మెట్‌లో యాంటి థెఫ్ట్ రింగ్, లాంగర్ చెక్ ప్యాడ్, బ్లూటూత్ డివైజ్ ఆప్షన్ వంటి ఫీచర్లున్నాయి. ఇవి ఓపెన్ ఫేస్ హెల్మెట్స్ విభాగం కిందకు వస్తాయి. వీటిని టూవీలర్ నడిపేవారు, కారు డ్రైవ్ చేసేవారు (అదనపు రక్షణ కోసం) కూడా ఉపయోగించొచ్చు.





Untitled Document
Advertisements