ఉబర్ కస్టమర్లకు బంపర్ ఆఫర్

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 03:43 PM

ఉబర్ కస్టమర్లకు బంపర్ ఆఫర్

అమెరికాకు చెందిన క్యాబ్ సేవ సంస్థ ఉబర్ తన వినియోగదారుల కోసం రెండు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై క్యాబ్‌లో ప్రయాణంలో డ్రైవర్‌తో సంభాషణ వద్దనుకునే వినియోగదారుల కోసం 'ఉబర్' సరికొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చింది. క్వైట్ మోడ్ ( Quiet Mode)పేరుతో ఉబర్ ఈ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. అయితే ఇది ప్రస్తుతం Uber Black and Uber Black SUV premium rides సర్వీసులకు మాత్రమే అందుబాటులో ఉంది.యూజర్లు ఇప్పుడు ఉబర్ యాప్ లో మూడు రకాల ఆప్సన్లను ఎంపిక చేసుకోవచ్చు. వాటిల్లో ఒకటి Quiet Preferred,కాగా రెండవది 'Happy to Chat' లేక No preference.ఈ ఆప్సన్ల ద్వారా ప్రయాణికులు ఉబర్ డ్రైవర్ తో తమ సంభాషణను కొనసాగించవచ్చు. ఇవి కాకుండా మెయల్స్ ద్వారా రిప్లయి ఇవ్వడం అలాగే మ్యూజిక్ వినడం లాంటి పనులు చేయవచ్చు. అలాగే త్వరలో క్రికెట్ వరల్డ్ కప్ సీజన్ మొదలు కాబోతున్న నేపథ్యంలో ఉబర్ ఓ అద్భుత అవకాశాన్ని ప్రయాణికులకు అందించింది. మే 30 నుంచి జూలై 14 వరకు ఇంగ్లాండ్‌, వేల్స్‌లో క్రికెట్ వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో ప్రయాణికులు ఉబర్ ద్వారా ఇంగ్లండ్ వెళ్లే ఛాన్స్ కొట్టేయవచ్చు. సింపుల్‌గా ఉబర్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినా, క్యాబ్ బుక్ చేసినా చాలు. మీరు క్రికెట్ వరల్డ్ కప్‌కు వెళ్లే ఛాన్స్ కొట్టేయొచ్చు. ఇందుకోసం మీరు ఉబర్ కాంటెస్ట్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో మీరు స్కోర్ చేస్తే చాలు... మీకు వరల్డ్ కప్ చూసే ఛాన్స్ రావొచ్చు. మీరు ఉబర్‌ ఈట్స్, ఉబర్‌ రైడ్‌లో చేసే ప్రతీ ఆర్డర్‌పై మీకు రన్స్ వస్తాయి. ఎన్ని రన్స్ ఎక్కువగా ఉంటే వరల్డ్ కప్ చూసే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు... బహుమతులు కూడా ఉంటాయి. రవాణా సంస్థ ఉబర్ ఇప్పటికే ఈ కాంటెస్ట్‌పై విరాట్ కోహ్లీతో ప్రకటనలు ఇస్తోంది.





Untitled Document
Advertisements