వన్డే సిరీస్‌ ఇంగ్లాండ్ సొంతం

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 03:59 PM

వన్డే సిరీస్‌ ఇంగ్లాండ్ సొంతం

ఇంగ్లాండ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆదివారం జరిగిన ఐదో వన్డేలో ఇంగ్లాండ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను ఇంగ్లాండ్ 4-0తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. జో రూట్ (84), ఇయాన్ మోర్గాన్ (74) జట్టులో టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు.. వోక్స్‌ (5/54) ధాటికి 46.5 ఓవర్లలో 297 పరుగులకే ఆలౌటైంది. సర్ఫ్‌రాజ్‌ (97), బాబర్‌ అజామ్‌ (80) మాత్రమే రాణించారు. ఇది ఇలా ఉంటే వరుసగా నాలుగు మ్యాచ్‌లలో 300 పరుగులు పైగా చేసిన జట్టుగా ఇంగ్లాండ్ రికార్డు సృష్టించింది.

Untitled Document
Advertisements