ప్రమాదం నుంచి తప్పించుకున్న సింగపూర్ విమానం

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 04:06 PM

ప్రమాదం నుంచి తప్పించుకున్న సింగపూర్ విమానం

బీజింగ్: ట్రిచీ నుంచి సింగపూర్ వెళ్లాల్సిన స్కూట్ ఎయిర్‌వేస్ టీఆర్ 567 విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానంలో పొగ రావడంతో పైలెట్ విమానాన్ని చెన్నైలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. సోమవారం తెల్లవారుజామున ట్రిచీ విమానాశ్రయం నుంచి స్కూట్ ఎయిర్‌వేస్ టీఆర్ 567 విమానం సింగపూర్ వెళ్లేందుకు బయలుదేరింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో పొగ రావడాన్ని పైలెట్ గమనించి, విమానాన్ని తెల్లవారుజామున 3.40 గంటలకు అత్యవసరంగా చెన్నై విమానాశ్రయంలో దించారు. ఈ విమానంలో 161 మంది ప్రయాణికులున్నారు. విమాన ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని, ఈ విమానం సోమవారం సాయంత్రం సింగపూర్ కు బయలుదేరి వెళుతుందని విమానాశ్రయం అధికారులు చెప్పారు. పొగరావడానికి కారణాలపై ఇంజినీర్లు విమానాన్ని పరిశీలిస్తున్నారు.

Untitled Document
Advertisements