యుద్ధం వస్తే ఇరాన్ అంతమైనట్లే!

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 04:13 PM

యుద్ధం వస్తే ఇరాన్ అంతమైనట్లే!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. యుద్దం వస్తే అది ఇరాన్ 'ముగింపు'నకు దారి తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇరాన్‌కు యుద్ధం కావాలి అంటే అది ఇరాన్‌కు అధికారిక ముగింపు అనే లెక్క, ఇంకెప్పుడూ అమెరికాను బెదిరించొద్దు" అని ఆదివారం ట్రంప్ ఘాటుగా ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో గల్ఫ్ తీరంలో అమెరికా అదనపు యుద్ధనౌకలను మోహరించిన సాగతీ తెలిసిందే. ఇక ట్రంప్ తాజా ట్వీట్‌తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చేలా కనిపిస్తున్నాయి. దీంతో ఇరాన్‌తో గొడవ యుద్ధరూపం దాల్చకూడదు అని కొద్దిరోజుల క్రితం ట్రంప్ తన సహాయకులకు చెప్పారు.కొద్దిరోజుల క్రితం ఇరాన్‌తో యుద్ధావకాశాల గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ట్రంప్ సమాధానమిస్తూ "పరిస్థితి అంతవరకు రాకూడదని ఆశిస్తున్నాం" అని అన్నారు.ఇటీవల ఇరాన్ కూడా యుద్ధావకాశాలను కొట్టిపారేసింది. "యుద్ధం జరిగే పరిస్థితి లేదు. మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు. అలాగే, ఇరాన్‌ని ఈ ప్రాంతంలో ఎదుర్కొనే శక్తి కూడా ఎవరికీ లేదు" అని ఇరాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ జవాద్ జరిఫ్ ఇరాన్ రాష్ట్ర మీడియాతో అన్నారు.

Untitled Document
Advertisements