నాకు నేనే పోటీ....నాతో నాకే పోటీ అంటున్న తమన్నా

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 06:07 PM

నాకు నేనే పోటీ....నాతో నాకే పోటీ అంటున్న తమన్నా

ఒక హీరో .. ఒక హీరోయిన్ కలిసి రెండు భాషల్లో నటించిన సినిమాలు రెండూ, ఒకే రోజున విడుదల కావడమనేది చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన సంఘటన ఇప్పుడు తమన్నా - ప్రభుదేవా విషయంలో జరుగుతోంది.

తమిళంలో తమన్నా - ప్రభుదేవా కలిసి 'దేవి 2' ( అభినేత్రి 2) సినిమా చేశారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ హారర్ సినిమాను ఈ నెల 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక తమన్నా - ప్రభుదేవా కాంబినేషన్లో హిందీలో 'ఖామోషి' హారర్ సినిమా నిర్మితమైంది.

చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 31వ తేదీనే విడుదల చేయనున్నారు. ఇలా తమన్నా - ప్రభుదేవా కలిసి చేసిన సినిమాలు రెండు, ఒకే రోజున ప్రేక్షకులను పలకరించనుండటం నిజంగా విశేషమేనని చెప్పుకోవాలి.

Untitled Document
Advertisements