అత్యాచార బాధితురాలికి పోలీస్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం!

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 06:14 PM

అత్యాచార బాధితురాలికి పోలీస్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం!

గత నెలలో రాజస్థాన్‌లోని థనగాజి-ఆళ్వార్ బైపాస్ రోడ్డు వద్ద బైక్‌పై వెళుతున్న ఇద్దరు దంపతులను అటకాయించి వారిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి భర్త ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాధితురాలికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది. బాధితురాలికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది.

Untitled Document
Advertisements