వారి పేర్లు ఎప్పటికి బయటపెట్టను: బాలీవుడ్ హీరోయిన్

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 06:39 PM

వారి పేర్లు ఎప్పటికి బయటపెట్టను: బాలీవుడ్ హీరోయిన్

పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టి చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న ఒడిదుడుకుల్ని హ్యుమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 17 ఏళ్ల వయసులోనే తాను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టానని శిల్పా శెట్టి తెలిపింది. కెరీర్ ఆరంభంలో నాకు హిందీ వచ్చేది కాదు. దీనితో కెమెరా ముందు డైలాగులు చెప్పలేక ఇబ్బందిపడేదాన్ని. ఆ సమయంలో నేను నటించిన చిత్రాలు పరాజయం చెందాయి.

మొదట నన్ను హీరోయిన్ గా ఎంచుకుని ఆ తర్వాత కారణం చెప్పకుండానే కొందరు నిర్మాతలు తొలగించారు. వారెవరో నాకు ఇప్పటికి గుర్తుంది. వారి పేర్లు ఇప్పుడు బయటపెట్టను. ఆ సమయంలో ఇండస్ట్రీలో నాకు మద్దతు తెలిపేందుకు లేరు. నన్ను ఎగతాళి చేసిన వారే మెచ్చుకునేలా చేశా. బిగ్ బ్రదర్ షోలో పాల్గొని విజేతగా నిలిచా.

దేశం మొత్తం గర్వపడేలా చేశావ్ అని నన్ను విమర్శించిన వారే అన్నారు. నాలాగే చాలా మంది హీరోయిన్లు జాతి వివక్ష ఎదుర్కొంటున్నారు. అలాంటి వారందరికీ నేనే స్ఫూర్తి అని శిల్పా శెట్టి తెలిపింది. ఎన్నో ఘోరమైన సంఘటనలని సమర్థవంతంగా ఎదుర్కొనడం వల్లే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని శిల్పా శెట్టి తెలిపింది.

Untitled Document
Advertisements