పాకిస్థాన్‌కు భారత్‌ ఆర్మీ హెచ్చరిక

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 06:49 PM

పాకిస్థాన్‌కు భారత్‌ ఆర్మీ హెచ్చరిక

భారత ఆర్మీ ఉత్తర కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్ రణ్‌బీర్‌ సింగ్ ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూపాకిస్థాన్‌ దుస్సాహసానికి పాల్పడితే గట్టిగా బదులిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో పాక్‌లోని బాలాకోట్‌లో భారత్‌ నిర్వహించిన దాడులను కొనియాడారు. పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న ఉగ్ర శిబిరాలపై ఫిబ్రవరి 26న భారత వైమానిక దళాలు చేసిన దాడులు ప్రశంసనీయం.

ఇది చాలా గొప్ప విజయం.. పాక్‌ భూభాగంలో చాలా లోపలికి వెళ్లి ఉగ్ర శిబిరాలపై దాడులు నిర్వహించారు. ఆ తదుపరి రోజే.. నియంత్రణ రేఖ వద్ద పాక్‌ వైమానిక దళ ఆపరేషన్లను మొదలు పెట్టింది. అయినప్పటికీ వారికి గట్టిగా బుద్ధి చెప్పాం అని వ్యాఖ్యానించారు. నియంత్రణ రేఖల వద్దకు వచ్చి దుశ్చర్యలకు పాల్పడే ధైర్యం పాక్‌ చేయొద్దు. భారత మిలిటరీ వ్యూహాలన్నీ పూర్తిగా స్పష్టంగా ఉన్నాయి. పాక్‌ భద్రతా బలగాలు ఎటువంటి దుస్సాహసానికి పాల్పడినా గట్టిగా బదులిస్తాం అని ఆయన తెలిపారు.





Untitled Document
Advertisements