మరోమారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న రవిప్రకాశ్

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 06:55 PM

మరోమారు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న  రవిప్రకాశ్

నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఇప్పటికే హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. నేడు ఆయన మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనపై సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన కేసులపై ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో మరోమారు ఆయన తరుపు న్యాయవాదితో పిటిషన్ దాఖలు చేయించారు. దీనిపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే రవిప్రకాశ్‌పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి దేశం విడిచి పారిపోకుండా ఆయన పాస్‌పోర్టును పోలీసులు సీజ్ చేశారు.

Untitled Document
Advertisements