సీఎం ఎన్టీఆర్.. అంటూ తారక్ నివాసం వద్ద ఫ్యాన్స్ కేకలు

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 07:33 PM

సీఎం ఎన్టీఆర్.. అంటూ తారక్ నివాసం వద్ద ఫ్యాన్స్ కేకలు

నందమూరి వారసుడిగా వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తిరుగులేని క్రేజ్ తో టాలీవుడ్ దూసుకుపోతున్నాడు. డాన్సులు, నటనతో ఎన్టీఆర్ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నేడు ఎన్టీఆర్ తన 20వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సోమవారం రోజు సినీ ప్రముఖుల నుంచి, అభిమానుల నుంచి ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి.

కాగా ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్ నివాసం వద్ద ఆయన అభిమానులు చేసిన సందడి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తారక్ నివాసం వద్ద భారీ సంఖ్యలో గుమిగూడిన అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. మరికొందరు సీఎం ఎన్టీఆర్ అంటూ కూడా కేకలు పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోమవారం రోజు ఎన్టీఆర్ తన ఇంటి మేడపై నుంచి అభిమానులకు అభివాదం చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అభిమానులు జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. సేవ కార్యక్రమాలు చేస్తూ ఆ దృశ్యాలని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. మరోపక్క రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2020 జులై 30న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల కానుంది.

Untitled Document
Advertisements