ముచ్చటగా ముగ్గురితో......అల్లు అర్జున్

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 07:38 PM

ముచ్చటగా ముగ్గురితో......అల్లు అర్జున్

టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సెంటిమెంట్స్ ఫాలో అవ్వడంలో ముందుంటాడు. తన అన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లను, భారీ కాస్టింగ్ ని పెట్టడం త్రివిక్రమ్ కి అలవాటు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకు కూడా అదే ఫాలో అవుతున్నాడు.

ఇప్పటికే హీరోయిన్ గా పూజా హెగ్డేని తీసుకున్నట్లు టాక్. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ ని కూడా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. నటి కేటికా శర్మని సినిమాలో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారట. అలానే మరో కీలక పాత్రలో నటి నివేదా థామస్ కనిపిస్తుందని సమాచారం.

అలానే బొమన్ ఇరానీ, టబు వంటి తారలు సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకి 'నాన్న నేను', 'అలకనంద' వంటి టైటిల్స్ ని పరిశీలిస్తున్నారు. గీతాఆర్ట్స్ తో కలిసి హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Untitled Document
Advertisements