నా విషయంలోనే తప్పుడు సర్వేలిచ్చాయి

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 07:52 PM

నా విషయంలోనే తప్పుడు సర్వేలిచ్చాయి

తమిళనాడులో అన్నాడీఎంకేకు భారీ ఎదురు గాలి వీచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో తమిళనాడు సీఎం పళని స్వామి స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ కేవలం ప్రజల అభిప్రాయాలను మాత్రమే తెలుపుతాయని సాక్షాత్తూ తన విషయంలోనే 2016 లో తప్పుడు ఫలితాలు చూపించాయని అన్నారు. తమిళనాడులోని అన్ని స్థానాల్లో, అలాగే పాండిచ్చేరిలో ఒక స్థానాన్ని గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

2016 లో అన్నాడీఎంకేకు కేవలం మూడు సీట్లు మాత్రమే వస్తాయని, అలాగే ఎడప్పాడి నుంచి తాను సైతం ఓడిపోతానని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని అన్నారు. కానీ చివరికి తాను 42,000 ఓట్లతో తాను గెలిచానని, అన్నాడీఎంకే ఏకంగా 10 స్థానాలను కైవసం చేసుకుందని ఆయన గుర్తుచేశారు. బీజేపీయే తిరిగి అధికారాన్ని చేపడుతుందని అన్ని సర్వేలు చెబుతున్నాయని అడిగితే... తాను కేవలం తమిళనాడు గురించే మాట్లాడుతున్నానని, అన్నాడీఎంకే జాతీయ పార్టీ కాదని, ప్రాంతీయ పార్టీ అని పళనిస్వామి స్పష్టం చేశారు.

Untitled Document
Advertisements