ఎడారి దేశంలో వేసవి కాలంలో భారీ వర్షాలు, కారణమిదే!

     Written by : smtv Desk | Tue, May 21, 2019, 09:38 AM

ఎడారి దేశంలో వేసవి కాలంలో భారీ వర్షాలు, కారణమిదే!

వేసవి కాలంలో వర్షాలు కురవడమనేది అరుదైన విషయం. మనదేశంలో అయితే సాయంత్రం వేళ గాలి దుమ్ములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ యూఏఈ లాంటి ఎడారి దేశంలో వేసవిలో వర్షాలు కురవడం అరుదైన విషయం. కానీ పవిత్ర రంజాన్ మాసంలో ఆ అరేబియా ద్వీపకల్పంలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి యూఏఈలో భారీ వర్షం కురిసింది. పొరుగున ఉన్న ఒమన్‌లోనూ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా కొన్ని చోట్ల వరదలు కూడా వచ్చాయి.

ఈ వారం కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని యూఏఈ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఓవైపు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నా.. వర్షాలు కురవడం పట్ల ప్రజానీకం ఆశ్చర్యపోతున్నారు. రంజాన్ నెలలో ఉపవాసం ఉంటున్నవారు ఒకింత ఊరట చెందుతున్నారు.

వేసవిలో అనూహ్య వర్షాలకు కారణమేంటో యూఏఈ రీసెర్చ్ ప్రోగ్రాం ఫర్ రెయిన్ ఎన్‌హాన్స్‌మెంట్ సైన్స్ వెల్లడించింది. తమ దేశంపై మేఘాలు విస్తరించి ఉండటంతో.. మేఘ మథనం జరిపి వర్షాలు కురిపిస్తున్నామని ట్వీట్ చేసింది.





Untitled Document
Advertisements