టాటా మోటార్స్‌ లాభంలో భారీ క్షీణత

     Written by : smtv Desk | Tue, May 21, 2019, 10:00 AM

టాటా మోటార్స్‌ లాభంలో భారీ క్షీణత

ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ ఫలితాలు నిరాశపరిచాయి. మార్చి 31వ తేదీతో ముగిసిన 2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ లాభం 49 శాతం క్షీణించి రూ.1108.66 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.2715.16 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని ఆర్జించింది. ఆదాయం కూడా రూ.91643.44 కోట్ల నుంచి రూ.87285.64 కోట్లకు తగ్గింది.

ఆర్థిక సంవత్సరం మొత్తం మీద టాటా మోటార్స్‌ రూ.28,724.20 కోట్ల నికరనష్టాన్ని నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది కంపెనీ రూ.9091.36 కోట్ల లాభంలో ఉంది. మొత్తం ఆదాయం రూ.2,96,298.23 కోట్ల నుంచి రూ.3,04,903.71 కోట్లకు పెరిగింది. నాలుగో త్రైమాసికంలో దేశీయ వ్యాపారం ద్వారా రూ.106.19 కోట్ల స్టాండ్‌ అలోన్‌ లాభం ఆర్జించింది. గత ఏడాది రూ.499.94 కోట్ల నష్టంలో ఉంది.

అయితే ఆదాయం మాత్రం రూ.19,173.46 కోట్ల నుంచి రూ.18,561.41 కోట్లకు దిగజారింది. మార్చి 31వ తేదీతో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అంతకు ముందు ఏడాదితో పోల్చితే రూ.946.92 కోట్ల స్టాండ్‌ అలోన్‌ నష్టం నుంచి బయటపడి రూ.2398.93 కోట్ల స్టాండ్‌ అలోన్‌ లాభం ఆర్జించింది. స్టాండ్‌ అలోన్‌ ఆదాయం రూ.69,202.76 కోట్లు.

జీవిత బీమా రంగంలోని ఈ కంపెనీ మార్చి 31వ తేదీతో ముగిసిన త్రైమాసికంలో 20 శాతం వృద్ధితో రూ.61.60 కోట్ల లాభం ఆర్జించింది. అదే తేదీతో ముగిసిన ఏడాది మొత్తంలో రూ.3200 కోట్ల ప్రీమియం వసూళ్లను అధిగమించింది. ప్రస్తుతం కంపెనీ నిర్వహణలో రూ.15.153 కోట్ల విలువ గల ఆస్తులున్నాయి.





Untitled Document
Advertisements