మా జోలికొస్తే ఖతం .. ట్రంప్ వార్నింగ్

     Written by : smtv Desk | Tue, May 21, 2019, 12:21 PM

మా జోలికొస్తే ఖతం .. ట్రంప్ వార్నింగ్

తమ జోలికొస్తే ఇరాన్​ను అంతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికాతో గొడవకు దిగితే.. అది ‘ఇరాన్​కు అధికారిక అంతం’ అవుతుందన్నారు. అమెరికాను బెదిరించాలని ఇంకెప్పుడూ చూడొద్దని సోమవారం ట్వీట్ చేశారు. ఓవైపు ఇరాన్​పై ట్రంప్ ఆంక్షలు విధించడం, మరోవైపు తమ అణు కార్యక్రమాలకు పరిమితులు విధించుకుంటామంటూ చేసుకున్న ఒప్పందాన్ని ఇకపై గౌరవించబోమని ఇరాన్ స్పష్టం చేసిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

ఇరాన్ బెదిరింపులతో ఓ క్యారియర్ స్ర్టైక్ గ్రూప్ (సీఎస్​జీ), బీ–52 బాంబర్లను ట్రంప్ ఇటీవల గల్ఫ్ కు పంపారు. ఈ నేపథ్యంలోనే ట్వీట్లు చేశారు. దీనికి ఇరాన్ కూడా దీటుగా బదులిచ్చింది. ‘‘దురాక్రమణదారులందరూ వెళ్లిపోయారు. కానీ ఇరానియన్లు వేల ఏళ్లుగా ఇలానే నిలబడ్డారు. ఎకనామిక్ టెర్రరిజం, జాతి విధ్వంస వ్యాఖ్యలతో మీరు ఇరాన్​ను అంతం చేయలేరు," అని ఆ దేశ ఫారిన్ మినిస్టర్ మొహమ్మద్ జావద్ జరీఫ్ ట్వీట్ చేశారు. ‘‘ఇరానియన్ ను బెదిరించాలని చూడకు. వీలైతే గౌరవం ఇచ్చి చూడు. అది పని చేస్తుంది” అని కౌంటర్ ఇచ్చారు.





Untitled Document
Advertisements