విడాకులు రద్దు చేయమని కోరిన జంట......కోర్టు తీర్పుతో అయోమయ స్థితిలో పడిన భార్యాభర్తలు

     Written by : smtv Desk | Tue, May 21, 2019, 01:47 PM

విడాకులు రద్దు చేయమని కోరిన జంట......కోర్టు తీర్పుతో అయోమయ స్థితిలో పడిన భార్యాభర్తలు

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం. ఆ గొడవల కారణంగా తమ జీవితమే నాశనమై పోతోంది అని అనుకున్నప్పుడు కోర్టు ద్వారా విడాకులు తీసుకోవడం కూడా సహజమే. కానీ విడాకులు తీసుకున్న కొంతకాలం తరువాత మళ్లీ భార్యాభర్తలుగా కలిసి జీవించాలనుకుంటే ఏం చేయాలి?.......ఏముంది విడాకులను రద్దు చేయమంటూ కోర్టును కోరితే సరిపోద్ది అని అంటారు.

విడాకులను రద్దు చేయమని కోరడం సబబే కానీ అబుదాబీకి చెందిన ఈ జంట ఇప్పటికీ మూడు సార్లు విడాకులు తీసుకున్నారు. తన భర్తకు స్లీపింగ్ డిసార్డర్ ఉండటంతో మానసిక ఒత్తిడికి గురై కోపంతో తనను వేధిస్తున్నాడంటూ పెళ్లైన 10 ఏళ్ల కాలంలో మూడు సార్లు విడాకులకు దరఖాస్తు చేసింది భార్య. ఇస్లామిక్ చట్టం ప్రకారం రెండు సార్లు విడాకులు తీసుకుని మళ్లీ భార్యాభర్తలుగా కలిసి జీవించవచ్చు.

ఈ కారణంగా కోర్టు వారికి రెండు సార్లు కలిసి జీవించే హక్కును కల్పించింది. ఇప్పడు మళ్లీ తాము కలిసి జీవించాలనుకుంటున్నాం అంటూ విడాకులను రద్దు చేయమంటూ కోర్టును కోరగా.. కోర్టు వారి కేసును కొట్టివేసింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం మూడు సార్లు విడాకులు తీసుకున్న తరువాత చట్టరీత్యా కలిసి జీవించాలనుకోవడం నేరం అని జడ్జి తెలిపారు. దీంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో భార్యాభర్తలిద్దరూ ఉన్నారు.





Untitled Document
Advertisements