పుట్టిన ప్రతి ఏడుగురు చిన్నారుల్లో ఒకరు..

     Written by : smtv Desk | Tue, May 21, 2019, 01:50 PM

పుట్టిన ప్రతి ఏడుగురు చిన్నారుల్లో ఒకరు..

పుడుతున్న ప్రతి ఏడుగురు చిన్నారుల్లో ఒకరు సరైన బరువుతో పుట్టడం లేదని లాన్సెట్ గ్లోబల్ హెల్త్ రిపోర్ట్ పేర్కొంది. 2015లో పుట్టిన చిన్నారుల్లో రెండు కోట్ల మంది కంటే ఎక్కువ పసిబిడ్డలు నిర్ణీత బరువు కంటే తక్కువ బరువుతో పుట్టినట్టు నివేదిక ద్వారా వెల్లడైంది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో జన్మించిన చిన్నారుల్లో 90 శాతం మంది బిడ్డలు 2.5 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టినట్టు నివేదిక పేర్కొంది.

148 దేశాల్లో పుట్టిన చిన్నారులపై అధ్యయనం చేసి ఈ నివేదిక రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 15 శాతం మంది చిన్నారులు పుట్టుకతోనే తక్కువ బరువుతో ఉన్నట్టు తేలింది. 2015లో దక్షిణాసియా దేశాల్లో 98 లక్షల మంది చిన్నారులు తక్కువ బరువుతో జన్మించారు. 2.5 కిలోల కంటే తక్కువ బరువుతో పుట్టే చిన్నారుల్లో మరణాల రేటు అధికంగా ఉండటమే గాక, అల్పబరువుతో పుట్టిన చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్టు వైద్యులు తెలిపారు.





Untitled Document
Advertisements