భారత్‌కు వచ్చేసిన నోకియా 3.2 స్మార్ట్‌ఫోన్

     Written by : smtv Desk | Tue, May 21, 2019, 06:26 PM

భారత్‌కు వచ్చేసిన నోకియా 3.2 స్మార్ట్‌ఫోన్

నోకియా బ్రాండ్‌తో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ మంగళవారం మరో ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. నోకియా 3.2 పేరుతో వచ్చిన ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ.8,990. 6.26 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయి. నోకియా 3.2లో రెండు రకాలు ఉన్నాయి. 2జీబీ ర్యామ్+16జీబీ అంతర్గత మెమొరీ రకం ధర రూ.8,990 కాగా, 3జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజీ రకం ధర రూ.10,790.

బయోమెట్రిక్ ఫేస్ అన్‌లాక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయిన ‘అడాప్టివ్ బ్యాటరీ’, గూగుల్ అసిస్టెంట్ బటన్ వంటివి ఉన్నాయి. అలాగే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 429 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 9పై ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ నెల 23 నుంచి దేశవ్యాప్తంగా అన్ని రిటైల్ అవుట్‌లెట్లతోపాటు నోకియా వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.





Untitled Document
Advertisements