ప్రైవేట్ విమానంలో.....మైనర్ బాలికతో మిలినీయర్ శృంగారం

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 10:45 AM

ప్రైవేట్ విమానంలో.....మైనర్ బాలికతో మిలినీయర్ శృంగారం

తన ప్రైవేట్ విమానంలో మైనర్ బాలికతో శృంగారంలో పాల్గొన్న అమెరికాకు చెందిన ఓ మిలినీయర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టీఫెన్ బ్రాడ్లీ మెల్(53) అనే సదరు వ్యాపారవేత్త విమానం గాల్లో ఉండగా ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి 15 ఏళ్ల మైనర్‌తో ఈ పాడు పని చేశాడు. కాగా, బాధితురాలి తల్లి న్యూజెర్సీలోని తెలిసిన ఓ వ్యాపారవేత్తతో తన కూతురికి ఫ్లైయింగ్ పాఠాలు నేర్పాలని కలవడం, అది కాస్తా స్టీఫెన్‌కు చేరడంతో దాన్ని అసరగా తీసుకొని అతగాడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

2017 నుంచి బాలికకు స్టీఫెన్ స్నాప్‌చాట్‌ ద్వారా శృంగార సందేశాలు పంపిస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అడిగేవాడట. నిందితుడికి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయిన తన కూతురి వయసు గల బాలికతో ఇలా చేయడం బాధాకరం.

బాలికను పలుమార్లు న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్ అనే ధనికులు ఉండే ప్రాంతంలోని తన గెస్ట్ హౌస్‌కు కూడా తీసుకెళ్లాడట. సొంత హెలిపాడ్, పలు ఎయిర్‌క్రాఫ్ట్‌లు గల స్టీఫెన్ 'ఎయిర్ లైఫ్‌లైన్' అనే స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నాడు. దీని ద్వారా చిన్న పిల్లలకు అనారోగ్యంగా ఉండి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే స్టీఫెన్ ప్రైవేట్ జెట్స్‌లో ఫ్రీగా తరలిస్తారు. యూఏస్ వ్యాప్తంగా ఎక్కడికైన వెళ్లి చికిత్స చేయించుకునేందుకు ఉచితంగా ఎయిర్‌క్రాఫ్ట్‌ సర్వీసులు అందుబాటులో ఉంచాడు స్టీఫెన్. ఒకవైపు స్వచ్ఛంద సేవ చేస్తూనే మరోవైపు ఇలాంటి పనులు చేస్తున్నాడు.

2017, జూలై 20న స్కూల్ బాలికతో తన ప్రైవేట్ జెట్‌లో సోమర్‌సెట్ విమానాశ్రయం నుంచి మసాచుసెట్స్‌లో గల బ్రాంస్టేబుల్ వరకు ప్రయాణించాడు. అయితే, తిరుగు పయనంలో విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి బాలికతో శృంగారంలో మునిగిపోయాడు. విషయం బయటకు తెలియడంతో పోలీసులు స్టీఫెన్‌ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.





Untitled Document
Advertisements