వెనక్కి తగ్గిన టాటా మోటార్స్

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 11:37 AM

వెనక్కి తగ్గిన టాటా మోటార్స్

ముంభై: ప్రముఖ టాటా మోటార్స్ సంస్థ మార్చ్గి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో కాస్త నిరాశపర్చింది. సంస్థ నికర లాభం 49శాతం తగ్గుదల నమోదై, క్యూ4లో(జనవరిమార్చి) సంస్థ లాభం రూ.1,108 కోట్లుగా నమోదైంది. పోయిన ఏడాది ఇదే త్రైమాసికానికి లాభం రూ.2,175 కోట్లుగా ఉండగా ఈ త్రైమాసికంలో మాత్రం కంపెనీ ఆదాయం రూ.86,422 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంలో రూ.89,928 కోట్ల ఆదాయం నమోదైంది. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ...మార్కెట్లలో సమస్యలు నెలకొన్న కారణంగా ఈ పరిస్థితి నెలకొందని, సృజనాత్మకత, అభివృద్ధి వంటి అంశాలను కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. మార్కెట్‌షేర్‌ను, లాభదాయకతను పెంచుకొంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. సంస్థ నిర్వహణ లాభం రూ.8,449.5 కోట్లు, మార్జిన్ 9.8శాతంగా నమోదైంది. జెఎల్‌ఆర్ పన్ను చెల్లించకముందు 269 మిలియన్ పౌండ్ల లాభాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 27.1శాతం తక్కువ. జెఎల్‌ఆర్ ఆదాయం 7,134 మిలియన్ పౌండ్లుగా నమోదైంది. అయితే మార్కెట్లో టాటా మోటార్స్ షేరు ధర 7.15 శాతం పెరిగి రూ.189.50 వద్ద స్థిరపడింది.





Untitled Document
Advertisements