మార్కెట్లోకి బోల్ట్‌ నానో

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 11:40 AM

మార్కెట్లోకి బోల్ట్‌ నానో

న్యూఢిల్లీ: జమైకా చిరుత హుస్సేన్‌ బోల్ట్‌ (బోల్ట్‌ మొబిలిటీ) సంస్థ తాజగా తన నుండి తొలి కారును మార్కెట్లో లాంచ్ చేసింది. బోల్ట్‌ నానో పేరుతో విడుదలైన ఎలక్ట్రిక్‌ నానో కారులో కేవలం ఇద్దరు మాత్రమే కూర్చొగలరు. ఇందులో రిమూవబుల్‌ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఈ బ్యాటరీకి చార్జింగ్‌ పెడితే 24 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. అంటే ఇది సిటీ డ్రైవింగ్‌కు బాగా ఉపయోగపడుతుంది. బోల్ట్‌ మొబిలిటీ ఇప్పటికే ఎలక్ట్రిక్‌ మిని స్కూటర్లను కూడా మార్కెట్లో లాంచ్‌ చేసింది. వీటిని ఒక్కసారి చార్జ్‌ చేస్తే 3.21కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించవచ్చు. పిల్లలకు ఇవి అనువుగా ఉంటాయి. బోల్ట్‌ నానో కారు ప్రి ఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీని దర రూ.7.02లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇకపోతే బోల్ట్‌ మొబిలిటీ సంస్థ 2018లో అమెరికాలో ఏర్పాటైంది. మైక్రో మొబిలిటీ లక్ష్యంగా ఈ కంపెనీని స్థాపించారు.





Untitled Document
Advertisements