ప్రపంచకప్ ను ఒక్కసారి కూడా ముద్దాడని కివీస్!

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 11:42 AM

ప్రపంచకప్ ను ఒక్కసారి కూడా ముద్దాడని కివీస్!

క్రికెట్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక్క ప్రపంచ కప్ కూడా సాధించని జట్లలో న్యూజిలాండ్ ఒక్కటి. ఈ జట్టు ఇప్పటికి జరిగిన అన్ని ప్రపంచ కప్ టోర్నీలో ఆడుతూ వస్తుంది. అయితే ఆ జట్టు ఒక్కసారి మాత్రమే ఫైనల్‌కు చేరింది. కిందటిసారి జరిగిన ప్రపంచకప్‌లో కివీస్ తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది. కానీ, తుది సమరంలో అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియా జట్టు చేతిలో ఓటమి పాలైంది. 1975లో జరిగిన తొలి ప్రపంచకప్ నుంచి న్యూజిలాండ్ బరిలోకి దిగింది. అప్పటినుండి ఇప్పటివరకు ప్రతి టోర్నీలో కూడా భారీ ఆశలతో బరిలోకి దిగే న్యూజిలాండ్ కప్పు సాధించకుండానే వెనుదిరగడం అలవాటుగా మార్చుకుంది. అయితే సెమీఫైనల్ వరకు సాఫీగా సాగే కివీస్ ప్రయాణం ఆ తర్వాత ఆగిపోతోంది. కిందటి ప్రపంచకప్‌లోనే తొలిసారిగా కివీస్ సెమీస్‌ను దాటి ఫైనల్‌కు చేరుకుంది. ఆ ఒక్కసారి తప్పితే ఎప్పుడూ కూడా కివీస్ ఫైనల్‌కు చేరింది లేదు. ఇదిలావుండా ఈసారి మాత్రం న్యూజిలాండ్ భారీ ఆశలతో ప్రపంచకప్‌కు సిద్ధమవుతోంది. ఈ జట్టులో ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు కొదవలేదు. అన్నింటికి మించి విలియమ్సన్ సారథ్యం ఆ జట్టుకు ప్రధాన బలంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కివీస్ సమతూకంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యూజిలాండ్ ప్రపంచకప్‌కు సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. అంతేగాక ఇప్పటి వరకు అందని ద్రాక్షగా మారిన ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.





Untitled Document
Advertisements