ఆ డైరెక్టర్ నన్ను 30 సార్లు కొట్టాడు.. కేన్స్ వేదికగా బయటపెట్టిన బ్యూటీ!

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 11:56 AM

ఆ డైరెక్టర్ నన్ను 30 సార్లు కొట్టాడు.. కేన్స్ వేదికగా బయటపెట్టిన బ్యూటీ!

ఓ యాడ్ ఫిల్మ్ సందర్భంగా దర్శకుడిని ప్రశ్నించినందుకు తనను 30 సార్లు చెంప దెబ్బలు కొట్టాడని తైవాన్ నటి వు కె ఝి (36) వెల్లడించింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె రచించి, నటించిన ‘నినా వు’ సినిమా ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ఫెస్టివల్‌కు హాజరైన నటి మాట్లాడుతూ ఒకప్పుడు తనపై జరిగిన దాడి గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ఓ యాడ్ షూట్‌లో జరిగిన ఆ భయంకరమైన ఘటనను తానెప్పటికీ మర్చిపోలేనని పేర్కొంది.

షూటింగ్ సందర్భంగా అది క్లోజప్ షాటా? లేక లాంగ్ షాటా? అని డైరెక్టర్‌ను అడిగానని, అందుకు అనుగుణంగా సిద్ధమవాలనే అలా ప్రశ్నించానని ఝి తెలిపింది. అయితే, తన ప్రశ్న వినగానే డైరెక్టర్ ఆగ్రహంతో తన చెంపను చెడామడా వాయించాడని, దాదాపు 30 సార్లు అతడి చేయి తన చెంపను బలంగా తాకిందని బాధగా చెప్పింది. ఆ తర్వాత ఆ షాట్‌ను క్లోజప్‌లోనే చిత్రీకరించారని పేర్కొంది. డైరెక్టర్ తనపై చేయి చేసుకోవడంతో అందరూ నిర్ఘాంతపోయారని వివరించింది. కేవలం ప్రశ్నించిన పాపానికి తీవ్ర శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయింది.





Untitled Document
Advertisements