రికార్డుల్లో రిలయన్స్‌

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 12:36 PM

రికార్డుల్లో రిలయన్స్‌

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీకి చెందినం రిలయన్స్‌ సంస్థ మరో ఘనత సాధించింది. ఆదాయం పరంగా ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ను (ఐవోసీ) వెనక్కు నెట్ట, రిలయన్స్ ఆదాయం పరంగా దేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ కేవలం ఆదాయంలో మాత్రమే టాప్‌లో కొనసాగడం కాదు.. ఇంకా ఇతర అంశాల్లోనే అగ్రస్థానంలో ఉంది. తాజా రికార్డులతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 3 రకాలుగా... ఆదాయం, లాభం, మార్కెట్‌ విలువ పరంగా మెరుగైన స్థానంలో ఉంటూ, దేశంలో నెంబర్‌ 1గా ప్రత్యేకతను చాటుకుంది. ఆర్ఐఎల్ 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.6.23 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. పోటీ సంస్థ ఐవోసీ టర్నోవర్‌ రూ.6.17 లక్షల కోట్లుగా ఉంది. అలాగే లాభం విషయంలోనూ రిలయన్స్‌ కంపెనీయే అగ్ర స్థానంలో కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఐవోసీ పోలిస్తే రిలయన్స్‌ రెట్టింపు స్థాయిలో రూ.39,588 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ విలువ పరంగా ఇప్పటికే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశంలో టాప్‌ కంపెనీగా ఉంది. ఈ విషయంలో టీసీఎస్‌తో తరచూ పోటీ పడుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో టెలికం, రిటైల్, డిజిటల్‌ సేవలు వంటి వినియోగ ఆధారిత వ్యాపారాల్లోకి రిలయన్స్‌ పెద్ద ఎత్తున విస్తరించడం అగ్ర స్థానానికి చేరుకునేందుకు దోహదపడింది.





Untitled Document
Advertisements